English | Telugu
కళాభవన్ మణి మృతిలో కొత్త కోణం
Updated : Mar 7, 2016
విలక్షణ నటుడు కళాభవన్ మణి అంత్యక్రియలు ఈరోజు ముగిశాయి. ఆయన మృతదేహాన్ని చూసేందుకు భారీగా అభిమానులు తరలిరావడంతో, కంట్రోల్ చేయడం పోలీసులకు చాలా కష్టంగా మారింది. రాజకీయ ప్రముఖుల, సినీ ప్రముఖుల ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. కేరళలోని త్రిశూర్ జిల్లా చలక్కుడిలో ఉన్న కళాభవన్ సొంతింటి దగ్గర ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయనది సహజ మరణం కాదన్న అనుమానాలు ఉండటంతో, పోస్ట్ మార్టం చేసి అంతర్గత అవయవాల శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. పరీక్షల్లో ఆయన శరీరంలో అనుమానాస్పదమైన రసాయనాన్ని గుర్తించారు కొచ్చి డాక్టర్లు. దీంతో పోలీసులు, మణి మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.