English | Telugu

సమంత, సాయిపల్లవి దేశద్రోహులా? 

పహల్ గామ్(Pahalgam)లో పాకిస్థాన్ కి చెందిన ఉగ్రవాదులు 28 మందిని అత్యంత పాశవికంగా చంపడంతో భారతీయుల్లో ఎంతగా ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయో తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం మన దేశం నుంచి పాకిస్థాన్ కి ప్రవహించే సింధు నది వాటర్ ని ఈ సంఘటన తర్వాత పాకిస్థాన్ కి మన దేశం నుంచి వెళ్తున్న సింధు నది అయితే టిబెట్‌లో పుట్టే ఈ సింధూనది వాటర్ పాకిస్థాన్ కి వెళ్లకుండా మన దేశం ఒక నిర్ణయం తీసుకుంటుంది. దీంతో పాకిస్థాన్ ఎడారిగా మారే అవకాశం ఉంది. భారతీయులందరు ఈ నిర్ణయాన్ని అమలు చెయ్యాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో రీసెంట్ గా సమంత(Samantha)సాయిపల్లవి(Saipallavi)సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ లు సంచలనంగా మారాయి. సమంత ఇన్ స్టాగ్రామ్ వేదికగా 'సముద్రాలు నీళ్లు తాగలేవు. చెట్లు తమ ఫలాలని తినలేవు. సూర్యుడు తన కాంతిని చూడలేడు. పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవు. ప్రకృతి ఇతరుల కోసం బతుకుతుంది. మనం ఒకరికొకరం సాయం చేసుకోవడానికి పుట్టాం అని కాథలిక్ చర్చి అధిపతి 'పోప్ ఫ్రాన్సిస్' చెప్పిన వ్యాఖ్యలని పంచుకుంది. పహల్ గామ్ సంఘటనతో ప్రజలంతా రగిలిపోతున్న వేళ, ఆమె చేసిన పోస్ట్ సింధు నది వాటర్ మన వాళ్ళు పాకిస్థాన్ కి ఆపకూడదనే అర్ధంలో ఉందని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత ఆమె వెంటనే తన వ్యాఖ్యలని ఇన్ స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసింది.

ఇక సాయి పల్లవి గతంలో మన ఇండియన్ ఆర్మీ(Indian Army)పాకిస్థాన్ వాళ్లకి టెర్రరిస్టుల్లా కనిపిస్తుంది. మన సైనికులకి పొగరని చెప్పిన మాటలని ఇప్పుడు సోషల్ మీడియాలో కొంత మంది పోస్ట్ చేస్తున్నారు. దీంతో పహల్ గామ్ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో సమంత,సాయిపల్లవి దేశద్రోహులంటు సోషల్ మీడియా వేదికగా కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలకి సంబంధించి సమంత, సాయిపల్లవి తమ అధ్బుతమైన పెర్ ఫార్మెన్స్ తో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నారు. హీరోయిన్ అనే క్యారక్టర్ కి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు.