English | Telugu

నావల్ల కాదంటున్న సమంత

వరుసగా సినిమాల్లో అవకాశాలు దొరికితే ఏ హీరోయిన్‌ అయినా ఎగిరి గంతేస్తుంది. అందులోనూ స్టార్ హీరోల సరసన అంటే.. ఇక వారి ఆనందానికి అవధులుండవు. అటూవంటిది.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంతా మాత్రం దిగిలుపడుతోంది.

యంగ్‌టైగర్ ఎన్టీఆర్, పవన్‌కళ్యాణ్, నాగచైతన్యల చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా సమంతా. ఆ హీరోల చిత్రాల షూటింగ్‌ల కోసం దేశాలు పట్టుకుని తిరగలేక నానాతంటాలు పడుతోంది. ఒక చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత మరో చిత్రం షూటింగ్‌లో పాల్గొంటూ వస్తున సమంతా.. ఇకపై తాను ఇలా ప్రయాణాలు చేయలేనని చెబుతోంది.

తమిళంలో విజయ్‌తో ఓ చిత్రంలో నటించాల్సి ఉంది.. ఆ చిత్రం పూర్తయిన తర్వాత కొన్ని రోజుల పాటు విరామం తీసుకుంటానని, ఇంకా తిరగడం నావల్ల కాదని సమంతా తన స్నేహితులతో చెబుతోందట!