English | Telugu
పవన్ మీద చిరు సెటైర్ వేశారా..?
Updated : Apr 11, 2016
నిన్న వైజాగ్ లో సరైనోడు ఆడియో సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగా వారు మాట్లాడిన స్పీచ్ వెనుక అంతరార్ధమేంటన్నది ఇప్పుడు సినీ జనాల్లో మైండ్స్ లో మెదులుతున్న ప్రశ్న. " అవకాశాలు రావడం ఒక ఎత్తు. ఆ ప్లాట్ ఫాం ను నిలబెట్టుకోవడం మరో ఎత్తు. అభిమానుల చేత శభాష్ అనిపించుకోవడం మాత్రం హీరోల చేతుల్లోనే ఉంది. వెనకాల మెగాస్టార్ ఉన్నాడు. మెగాఫ్యాన్స్ రెడీమేడ్ గా ఉన్నారు. మాకేమీ తిరుగులేదు అని ధీమాతో ఉంటే ఎదురుదెబ్బ తినే అవకాశాలున్నాయి " ఇవీ మెగాస్టార్ చెప్పిన మాటలు. ఈ మాటలు సర్దార్ గురించేనా అనేది ఇప్పుడు ప్రతీ ఒక్కరి మదిలో ఉన్న ప్రశ్న. ఈ మాటలు చెప్పే సమయంలో చిరంజీవి ఎక్స్ ప్రెషన్స్ కూడా కాస్త సెటైరికల్ గాఉండటం విశేషం. సర్దార్ గబ్బర్ సింగ్ కోసం పవన్ కష్టపడినప్పటికీ, సినిమా ఎలా ఉన్నా ప్రేక్షకులు ఆదరించేస్తారని, అభిమానుల్ని లైట్ గా తీసుకున్నారనే అభిప్రాయంలో ఉన్నారనే మాట సినిమా రిలీజ్ తర్వాత వినిపించింది. తెర మీద తనొక్కడే నడిపించగలననుకోవడం కూడా సర్దార్ కు దెబ్బేసింది. ఈ విషయమ్మీదే చిరు వ్యంగ్యాస్త్రాలు వదిలారనే మాట ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. లేదంటే, చిరుకు ఆడియో సక్సెస్ మీట్ లో ఈ విషయం మాట్లాడాల్సిన అవసరమేముందో...!