English | Telugu
విజయ్ కూతురు సూసైడ్.. వైరల్ అవుతున్న సాయిపల్లవి ట్వీట్
Updated : Sep 20, 2023
ప్రముఖ సంగీత దర్శకుడు, కథానాయకుడు విజయ్ ఆంటోనికి పుత్రికావియోగం కలిగిన సంగతి తెలిసిందే. నిన్న (సెప్టెంబర్ 19) ఉదయం విజయ్ కూతురు మీరా (16) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇండస్ట్రీలో కలకలం రేపింది. కాగా, ఈ రోజు (బుధవారం) మీరా మృతిపై స్టార్ హీరోయిన్ సాయిపల్లవి స్పందించారు.
"మీరా ఆత్మహత్య హృదయవిదారకం. ఆమె కుటుంబం పొందుతున్న బాధ వర్ణనాతీతం. విజయ్ (ఆంటోని) సార్, కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. మీకు అపార బలం కలిగించమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరా ఆత్మకి శాంతి కలుగుగాక" అంటూ సాయిపల్లవి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.