English | Telugu

‘రజాకార్‌’ టీజర్‌ వివాదం... సెన్సార్‌ బోర్డ్‌కు ఫిర్యాదు చేయనున్న కేటీఆర్‌

చరిత్రలో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలు, అరాచకాలను ప్రతిబింబిస్తూ తీసిన ఎన్నో సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. అయితే కొన్ని హద్దులు మీరి సమాజానికి చేటు కలిగించే సన్నివేశాలు ఉన్న సినిమాలూ వచ్చాయి. వాటిని ప్రతిఘటించి రిలీజ్‌ని నిలిపివేయడం, లేదా అభ్యంతరకర సన్నివేశాలను తొలగించడం ద్వారా కొంత కట్టడి చేయగలిగారు. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడల్లా సెన్సార్‌ వారు తమ కత్తెరను వాడాల్సి వస్తోంది. రీసెంట్‌గా విడుదలైన ‘రజాకార్‌’ సినిమా టీజర్‌ను చూస్తుంటే మరోసారి ఆ అవసరం వచ్చిందేమో అనిపిస్తోంది.

విషయానికి వస్తే... యాటా సత్యనారాయణ దరకత్వంలో గూడూరు నారాయణరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘రజాకార్‌’. విడుదలైన ఈ సినిమా టీజర్‌ తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఎన్నికలు సమీపిస్తుండగా ఇలాంటి సినిమా రావడంపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది పెద్ద వివాదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1947లోనే స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్‌కు రాలేదన్న పాయింట్‌తో ‘రజాకార్‌’ టీజర్‌ మొదలవుతుంది. ఆ సమయంలో హైదరాబాద్‌ సంస్థానంలో రజాకార్లు చేసిన అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, అత్యాచారాల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది చూపించారు. అంతేకాదు, హిందువులందరినీ ముస్లిం మతంలోకి మార్చాలన్న ఉద్దేశంతో రజాకార్లు ఈ చర్యలకు పాల్పడ్డారన్నది చూపించే ప్రయత్నం చేశారు. బ్రాహ్మణుల యజ్ఞోపవీతాలను తెంపేయడం, తెలుగు మాట్లాడేవారి నాలుక కోసేయడం, ఇస్లాంలోకి మారని వారిని మూకుమ్మడిగా ఉరి తీయడం వంటి భయానక సన్నివేశాలు ఈ టీజర్‌లో దర్శనమిచ్చాయి.

ఈ టీజర్‌ విడుదల కాగానే నెటిజన్లు షాక్‌ అయ్యారు, రజాకార్ల అరాచకాల పేరుతో ముస్లింలను టార్గెట్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారని కొందరు మత పెద్దలు, రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ లబ్ది కోసం ఇలాంటి సినిమాలు తియ్యడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మత ఘర్షణలు పెరిగిపోయే ప్రమాదం ఉందని నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. ఈ సినిమా వల్ల జరిగే ముప్పును మంత్రి కెటిఆర్‌ దృష్టికి తీసుకెళ్ళాడు ఓ నెటిజన్‌. టీజర్‌ కెటిఆర్‌కు ట్యాగ్‌ చేశాడు.

దీనిపై స్పందించిన కెటిఆర్‌ కొంతమంది తెలివి తక్కువ బీజేపీ జోకర్లు, స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణలో మత విద్వేశాలు రెచ్చగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పుడు ‘రజాకార్‌’ సినిమాను విడుదల చేయడంలో ఉద్దేశం కూడా అదేనని అన్నారు. ఈ సినిమా విషయాన్ని సెన్సార్‌ బోర్డ్‌ దృష్టికి తీసుకెళ్తామని అంటూ తెలంగాణ పోలీసులు లా అండ్‌ ఆర్డర్‌ దెబ్బ తినకుండా చూసుకోవాలని కోరారు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.