English | Telugu

మహేష్ కి వదినగా రోజా!

బుల్లితెర మీద జబర్దస్త్ జడ్జ్ గా రోజా మనకు తెలుసు అలాగే సీరియల్ యాక్టర్ గా రకరకాల ఈవెంట్స్, షోస్ లో కనిపించే శ్రీవాణి ఆమె భర్త విక్రమాదిత్య కూడా అందరికీ తెలిసిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు బుల్లితెర మీదే కాదు వాళ్ళు బిజినెస్ లో కూడా ఫుల్ పాపులర్ కావాలని చూస్తున్నారు. అలా ఇప్పుడు వాళ్ళు కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేశారు. "మీ కడపునిండా" అనే రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసి మంత్రి రోజా చేతులు మీదుగా రిబ్బన్ కట్ చేయించారు.

ఇక తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చారు "మమ్మల్ని ఎప్పుడు చూడాలనుకున్నా ఈ రెస్టారెంట్ లోనే ఉంటాం..అలాగే ఈ రెస్టారెంట్ కి వచ్చేవాళ్లంతా ఆహా ఏమి రుచి అనరా మైమరిచి అనే పాట పాడకుండా ఉండరు...రొయ్యల ఇగురు, పీతల ఫ్రై, కీమా రోల్స్, సంగటి, చేపల పులుసు.. మార్నింగ్ టైం డ్రై ఫ్రూప్ట్స్ తో ఓట్స్ తింటాను మధ్యాహ్నం పూట రోజూ నాన్ వెజ్ తప్పనిసరి..గుడికి వెళ్ళినప్పుడు, కార్తీక మాసం టైములో తినను. నైట్ దోస, ఇడ్లీ అలా తింటాను.. ఎప్పుడూ బిజీగా ఉండే నేను కోవిడ్ టైంలో వంట చేసే అవకాశం లభించింది..మహేష్ బాబుకి అక్కగా, వదినగా నటించాలని ఉంది..అవకాశం వస్తే చేస్తా ...కాంతారా, బేబీ, మిస్ శెట్టి వంటి మూవీస్ డిఫరెంట్ జానర్స్ లో బాగుంటున్నాయి. డైరెక్టర్స్ కూడా కొత్తగా ట్రై చేస్తున్నారు. ఇది వరకు నాలుగు ఫైట్లు, నాలుగు పాటలు, ఒక ఇంటర్వెల్ వీటి మధ్యే స్టోరీ ఉండేది..అరుంధతి మూవీలో అనుష్క క్యారెక్టర్ ని చూసినప్పుడల్లా మనం హీరోయిన్ గా ఉన్నప్పుడు ఇలాంటి క్యారక్టర్ రాలేదే అనుకుంటూ ఉంటాను.. నా ఫస్ట్ మూవీ చామంతి...ఆ మూవీ షూటింగ్ వైజాగ్ బీచ్ లో చేశారు.. అందుకే నాకు వైజాగ్ అంటే చాల ఇష్టం. ఇక హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాం కాబట్టి ఈ ప్లేస్ అన్నా కూడా ఇష్టమే " అని చెప్పారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.