English | Telugu
103వ అంతస్థులో పుషప్స్ చేసిన రెజీనా
Updated : Mar 20, 2016
రెజీనా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చేసేసి చాలా కాలమైంది. కానీ ఎందుకో ఇప్పుడు అమ్మడికి మళ్లీ ఆ రోజులు గుర్తు చేసుకోవాలనిపించినట్టుంది. ఆ టైంలో దిగిన ఫోటోను ఇన్ని రోజుల తర్వాత తన ట్విట్టర్లో షేర్ చేసుకుంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ టైంలో షూటింగ్ కోసం రెజీనా చికాగో వెళ్లింది. చికాగో లోని విల్లీస్ టవర్ లో 103 అంతస్థులో వ్యూ పాయింట్ అని ఒకటి ఉంది. దాన్ని స్కైడెక్ అంటారు. అక్కడ నుంచుంటే కాస్త భయం అనిపించకమానదు. ఎందుకంటే అన్ని అంతస్థుల పైన ఉన్న ఆ వ్యూపాయింట్ ట్రాన్ పరంట్ గా ఉంటుంది.
ఆ అద్దంపైన నుంచుని కిందకు చూస్తే కళ్లు తిరగడం కన్ఫామ్. అక్కడ రెజీనా పాప ధైర్యంగా పుష్ అప్స్ చేసేసింది. వ్యూ ఎలా ఉందో ఫోటో చూస్తే తెలుస్తోందిగా. మీరు స్కైడెక్ 103 అంతస్థులో ఉండి ఎవరైనా పుషప్స్ కు పిలిస్తే, చూస్తూ ఉండద్దు. వెళ్లి చేసేయడమే అంటూ ట్వీట్ చేసింది. దీంతో రెజీనా ఇంకా సుబ్రహ్మణ్యాన్ని మర్చిపోలేకపోతోంది అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అదంతా ఓకేలే గానీ, ఆ పక్కన పుషప్స్ చేస్తున్నది ఎవరు అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న..