English | Telugu

అల్లు అర్జున్ సరైనోడు ఆడియో ఏప్రిల్ 1న రిలీజ్

బోయపాటి శ్రీను డైరెక్షన్లో, అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోంది సరైనోడు. ఇప్పటికే టీజర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లతో మోత మోగించేసిన అల్లు వారి సినిమాకు ఆడియో ఫంక్షన్ లేదు. డైరెక్ట్ గా మార్కెట్ లోకి పాటల్ని రిలీజ్ చేసేస్తున్నామని మూవీ టీం ప్రకటించేసింది. కాకపోతే, ఫార్మాలిటీ కోసం, వైజాగ్ లో చిన్న ప్రెస్ మీట్ ఎరేంజ్ చేస్తామని చెప్పారు. ఏప్రిల్ 1న సరైనోడు ఆడియో మార్కెట్ లోకి ఎంటరవ్వబోతోంది. తమన్ ఇచ్చిన సంగీతం సినిమాకు చాలా బాగా కుదిరిందని నమ్మకంగా చెబుతున్నారు సరైనోడు టీం. యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ తో, అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చేలా సినిమాను తెరకెక్కించామని అంటోంది మూవీ టీం. సరైనోడు లో అంజలి స్పెషల్ సాంగ్ కు చిందేయడం విశేషం. బన్నీ సరసన క్యాథరీన్ ట్రెసా, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. విలన్ గా హీరో ఆదిపినిశెట్టి చేసిన యాక్షన్, మూవీకి వన్ ఆఫ్ ది హైలెట్స్ గా నిలవనుందని సమాచారం.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.