English | Telugu
సర్దార్ ఆడియో ఫంక్షన్ పాస్ లకు ఇంత డిమాండా..?
Updated : Mar 20, 2016
ఈరోజు నోవోటెల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఆడియో ఫంక్షన్ కోసం జారీ చేసిన పాస్ ల విషయంలో చాలా కథనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పాస్ లు కావాలని ఎంత ట్రై చేసినా, అభిమానులకు దొరకని పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో ఒక ఆడియో ఫంక్షన్ కు ఇంతలా డిమాండ్ ఉండటం చూడలేదంటున్నారు సినీ జనాలు. ఇండియా క్రికెట్ మ్యాచ్ టిక్కెట్స్ కు ఎంత డిమాండ్ ఉంటుందో, ఆ రేంజ్ లో సర్దార్ పాస్ ల కోసం డిమాండ్ ఉంది.
భద్రతా కారణాల రీత్యా, పాసులున్న వాళ్లు మాత్రమే ఆడియోకు రావాలంటూ పవన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన విషయం తెలిసిందే. తమ అభిమాన స్టార్ ను ఎలాగైనా లైవ్ లో చూడాలని పవన్ తహతహలాడుతున్నా చాలా మందికి ఆ అవకాశం దక్కేలా లేదు. ఆంధ్రా, తెలంగాణా మంత్రులు తమ వాళ్లకోసం డైరెక్ట్ గా మూవీ టిం దగ్గర్నుంచి 100 పాస్ లు తీసుకున్నారనే ప్రచారం కూడా నడుస్తోంది. అందువల్లనే పాస్ లు ఎక్కవమంది అభిమానులకు దొరకలేదని అంటున్నారు. ఏది ఏమైనా, పవన్ క్రేజ్ మాత్రం రోజు రోజుకూ పెరుగుతూ పోతోందనడంలో సందేహం లేదు. అందుకు ఈ డిమాండే ఎగ్జాంపుల్.