English | Telugu

చక్రి మరణవార్త నమ్మలేకపోతున్నా: రవితేజ

ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం ,ఇడియ‌ట్‌, అమ్మా నాన్నా ఓ త‌మిళ‌మ్మాయ్, నేనింతే... ఇలా ర‌వితేజ న‌టించిన ఎన్నో చిత్రాల‌కు చ‌క్రి బాణీలు అందించారు. ర‌వితేజ విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించారు. అలాంటి చక్రి మృతిని ర‌వితేజ జీర్ణించుకోలేక‌పోతున్నాడు. దాదాపు ర‌వితేజ స‌క్స‌స్ కెరీర్ లో త‌న‌తో ట్రావెల్ అయ్యారు చ‌క్రి.. ''ఈరోజు ఉద‌యం చ‌క్రి మ‌ర‌ణ‌వార్త విన్నాను. చాలా షాక్‌కి గుర‌య్యా'' అంటున్నాడు ర‌వితేజ‌. ''చ‌క్రి మ‌ర‌ణం యావ‌త్ సంగీత లోకానికి తీవ్రమైన లోట‌ని, చ‌క్రి ఎక్క‌డ వున్నా అత‌ని ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని కోరుకుంటూ అలానే వారి కుటుంబ స‌భ్యుల‌కి నా తీవ్ర సంతాపాన్ని తెలుపుతున్నాను, వారి కుటుంబానికి మ‌నోధైర్యం ఇవ్వాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని కోరుకుంటున్నాను'' అని అన్నారు.