English | Telugu

ప్రముఖ డైరెక్టర్ బాలచందర్‌ కు తీవ్ర అస్వస్థత

ప్రముఖ సినీ దర్శకుడు కె.బాలచందర్ తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. సోమవారం తన స్వగృహంలో ఆయన తీవ్ర అస్వస్థతకు లోనవడంతో వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు కావేరి ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. 84 సంవత్సరాల వయసున్న బాలచందర్ వృద్ధాప్య కారణంగా పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. బాలచందర్‌ అస్వస్థతకు గురైనట్లు సమాచారం తెలుసుకున్న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆయనను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్ళినట్లు సమాచారం. భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయే అదర్భుతమైన సినిమాలను బాలచందర్ రూపొందించారు. తమిళంతోపాటు తెలుగు చిత్రాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు.