English | Telugu

రవితేజ పై ఇలియానా సంచలన వ్యాఖ్యలు..?

చిన్న చిన్న పాత్రల నుంచి, మాస్ మహారాజ్ గా తన స్థాయిని పెంచుకున్నారు హీరో రవితేజ. ఆయన సినిమాలకు, మ్యానరిజానికి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ఈ మధ్య రవితేజ రూపం కొద్దిగా కళ తగ్గిందని అందరూ అంటున్న మాట. దాంతో తిరిగి సాలిడ్ గా తన పాత రూపంలోకి రావడానికి రవితేజ ట్రై చేస్తున్నారు. అలా పూర్తిగా మారే లోపు సిక్స్ ప్యాక్ చేసేయాలని రవి ఫిక్సయ్యారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఆయన సిక్స్ ప్యాక్ లుక్ చక్కర్లు కొడుతోంది.

త్వరలో రాబోతున్న రాబిన్ హుడ్ సినిమా కోసమే ఆయన ఈ ప్యాక్ చేశారంటున్నాయి సినీ వర్గాలు. మరో వైపు హీరోయిన్ ఇలియానా రవితేజ సిక్స్ ప్యాక్ పై సంచలన కామెంట్స్ చేసిందనే పుకార్లు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. సిక్స్ ప్యాక్ బాగానే ఉన్నా, రవి ఏజ్ ఫేస్ లో కనిపిస్తోందంటూ ఇలియానా కామెంట్స్ చేసిందనే వార్త ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. కానీ ఇప్పటి వరకైతే, ఈ విషయమై ఆమె ట్విట్టర్లో గానీ, ఇన్ స్టాగ్రాం లో గానీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. మరి ఈ టాక్ నిజమో కాదోననేది ఇలియానా చెప్తే తప్ప తెలిసేలా కనిపించడంలేదు. వీళ్లిద్దరూ ఇప్పటికే కిక్, ఖతర్నాక్ సినిమాల్లో కలిసి నటించారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.