Read more!

English | Telugu

పవన్ కళ్యాణ్ కు తిక్కుంది, దానికో లెక్కుంది

పవన్ సినిమాల్లో ఎలా ఉన్నా బయట మాత్రం చాలా ప్రశాంతంగా, కూల్ గా ఉంటారు. సినిమా సెట్స్ లో కానీ, సహనటులతో కానీ చాలా సరదాగా ఉంటారు. కానీ అదంతా తప్పు చేయనంత వరకే. ఎవరైనా సినిమా పరంగా తప్పు చేస్తే మాత్రం ఆయనకు వెంటనే కోపం వస్తుంది. తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ కు సంబంధించిన పిక్ ఒకటి లీక్ అయింది. దీంతో పవన్ ఉగ్రరూపం దాల్చారట. అసలు దీన్ని బయటికి తీసుకొచ్చింది ఎవరో తెలియాలంటూ క్లాస్ తీసుకున్నాడని సమాచారం.

గతంలో అత్తారింటికి దారేది అయితే, ఇండస్ట్రీ చరిత్రలోనే పెద్ద లీకేజీ. ఏకంగా సగం సినిమాయే బయటికొచ్చేయడంతో, ప్రొడ్యూసర్ పరిస్థితేంటన్న ఆందోళన ఇండస్ట్రీలో కనబడింది. కానీ లక్కీగా పవన్ స్టామినా, త్రివిక్రమ్ మ్యాజిక్ సినిమాను ఒడ్డుకు లాక్కొచ్చి, ప్రొడ్యూసర్ ను కాపాడాయి. దాంతో మరోసారి అలాంటివి రిపీట్ కాకూడదని పవన్ స్ట్రాంగ్ గా అనుకున్నారు. అత్తారింటికి సక్సెస్ మీట్ లో కూడా, పైరసీ గురించి పవన్ ఆవేశంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో, మళ్లీ సర్దార్ కు కూడా ఫోటో లీక్ అవడం ఆయన్ను షాక్ గురిచేసిందని, దాంతో ఎడిటింగ్ స్టాఫ్ పై కన్నెర్ర చేశారని వార్తలు వస్తున్నాయి. కేవలం ఫోటో మాత్రమే బయటికి రావడంతో, పవన్ ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై సినిమాకు సంబంధించిన ప్రతీ డిపార్ట్ మెంట్ నూ స్ట్రిక్ట్ గా చూడాలని ఆర్డర్స్ వేశారట పవన్. సమ్మర్లో బరిలోకి దిగుతున్న సర్దార్ పై ఇప్పటికే చాలా అంచనాలున్నాయి. సర్దార్ కు పవన్ కూడా నిర్మాత కావడం కొసమెరుపు.