English | Telugu

రష్మిక కొత్త వ్యాపారం ఇదే.. పక్కా డోర్ డెలివరీ 

కొన్ని రోజుల నుంచి స్టార్ హీరోయిన్ 'రష్మిక'(Rashmika Mandanna)సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తు మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. అమ్మకి కూడా కాల్ చేశాను. దేవుడి ఆశీర్వాదం అంటు ట్వీట్స్ చేసింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ రష్మిక తన పెళ్లి విషయం గురించి ఏమైనా చెప్తుందేమో అని అనుకున్నారు. కానీ అందరికి షాక్ ఇస్తు రీసెంట్ గా రష్మిక తన సీక్రెట్ ని రివీల్ చేసింది.

'డియర్ డైరీ'(Dear diary)అనే పేరుతో రష్మిక పెర్ఫ్యూమ్(Perfume)రంగంలోకి అడుగుపెట్టింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్నీ తెలియచేసిన రష్మిక 'డియర్ డైరీ అంటే ఒక బ్రాండో, బిజినెస్ నో కాదు. నా జీవితంలో ఒక భాగం. ఆ పరిమళాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది. అదే టైంలో భయంగా కూడా ఉంది. డియర్ డైరీ ని ముందుకు తీసుకెళ్లడానికి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరింది. దీంతో అభిమానులతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు 'రష్మిక' కి కంగ్రాట్స్ చెప్తున్నారు. డియర్ డైరీ ద్వారా పలు రకాల బ్రాండ్ లకి చెందిన 'పెర్ఫ్యూమ్స్' అందుబాటులో ఉండనుండగా, వాటి ధర 1600 వందల రూపాయిల నుంచి 2599 రూపాయలు. ప్రస్తుతానికైతే ఆన్ లైన్ ద్వారానే డియర్ డైరీ వర్క్ చేయనుంది.

రష్మిక సినీ కెరీర్ విషయానికి వస్తే ఇటీవల కుబేర తో మరోసారి హిట్ ని అందుకొని, ప్రస్తుతం టైటిల్ రోల్ లో 'ది గర్ల్ ఫ్రెండ్'(The Girl Friend)అనే మూవీ చేస్తుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ సెప్టెంబర్ 5 రిలీజ్ కాబోతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. రీసెంట్ గా 'మైసా'(Mysaa)అనే మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హిందీలో కూడా 'థామ' అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీలో చేస్తుంది. పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 ,చావా, యానిమల్ వంటి చిత్రాలతో రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే.


ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.