English | Telugu

వార్-2 ట్రైలర్.. షాక్ ఇవ్వబోతున్న ఎన్టీఆర్!

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'వార్-2'. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా 'వార్'కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులు ఈ మూవీ ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. (War 2 Trailer)

బిగ్ స్టార్స్ ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో 'వార్-2'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే నెలలో విడుదలైన టీజర్ ఆ అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేకపోయింది. దీంతో అందరి దృష్టి ట్రైలర్ పై పడింది. వార్-2 ట్రైలర్ ను జూలై 25న విడుదల చేయనున్నట్లు తాజాగా నిర్మాతలు ప్రకటించారు. ట్రైలర్ కట్ అదిరిపోయిందని ఇన్ సైడ్ టాక్. 2 నిమిషాల 39 సెకన్ల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్.. యాక్షన్ ప్రియులను కట్టిపడేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ట్రైలర్ లో ఎన్టీఆర్ సర్ ప్రైజ్ చేస్తాడని చెబుతున్నారు. అదే జరిగితే తెలుగునాట వార్-2 భారీ వసూళ్లు రాబడుతుంది అనడంలో సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తోంది.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.