English | Telugu
మహేష్ టైటిల్ రామ్ కి నచ్చలేదా?
Updated : Feb 3, 2015
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో క్రిష్ 'శివమ్' అనే సినిమా తీస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని మహేష్ కూడా అప్పట్లో చెప్పాడు కానీ ఆ సినిమా మెటీరియలైజ్ అవ్వలేదు. అయితే ఈ టైటిల్ ను హీరో రామ్ తన సినిమా కోసం తీసుకున్నాడని కొద్ది రోజుల క్రితం మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలను విన్న రామ్ వెంటనే తన సినిమా టైటిల్ మార్చాలని దర్శకుడిని కోరారట. దీంతో ఈ సినిమాకి ‘శివం.. శివోహం’ అనే టైటిల్ ను ఫీల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారట. ఈ సినిమాకి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు, రాశిఖన్నా హీరోయిన్. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.