English | Telugu

'ఉత్తమ విలన్' రెడీ అవుతున్నాడు

యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్ అప్ కమింగ్ మూవీ 'ఉత్తమ విలన్' రిలీజ్ కు ముహూర్తం ఖరారు అయింది. ఈ సినిమాను ఏప్రిల్ 2న, ఆడియోను మార్చి ఒకటిన విడుదల చేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారట. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన లింగుస్వామి ట్విట్టర్ ద్వార తెలిపారు. కథ, స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటు ఈ సినిమాలో కమల్ రెండు పాత్రలు పోషిస్తున్నారు. అందులో ఒకటి కళాకారుడి పాత్ర. విశ్వరూపంలో కమల్ సరసన కీలక పాత్ర పోషించిన ఆండ్రియా ఈ సినిమాలో కూడా నటించింది. కమల్ సినీ గురువు, దర్శకుడు కె. బాల చందర్ ఈ సినిమాలో ఓ ప్రముఖ పాత్రను పోషించారు.