English | Telugu
బాలయ్య వందో సినిమాకి గురి పెట్టాడు
Updated : Feb 3, 2015
నందమూరి బాలకృష్ణ వందో సినిమా ఎప్పుడు? ఎవరితో? అది ఎలా ఉండబోతోంది?? నందమూరి ఫ్యాన్స్ అంతా ఈ విషయంపై తెగ మాట్లాడుకొంటున్నారు. పరిశ్రమ కూడా ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అవకాశం వస్తే ఈసినిమాకి దర్శకత్వం వహించాలని డైరెక్టర్లంతా ఎదురుచూస్తున్నారు. బడా ప్రొడ్యూసర్లు బాలయ్య పిలుపు కోసం కలలు కంటున్నారు. ఆఖరికి కల్యాణ్‌రామ్ కూడా బాలయ్య వందో సినిమాపై గురి పెట్టాడు. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాలని ఆశగా ఉందట. పటాస్‌తో ఓ హిట్ కొట్టి ఫామ్‌లోకి వచ్చాడు కల్యాణ్‌రామ్. బాబాయ్ బాలకృష్ణ అంటే కల్యాణ్‌కి చెప్పలేనంత అభిమానం. పటాస్‌లో రౌడీ ఇనస్పైక్టర్‌లోని పాటని రీమిక్స్ చేసి బాలయ్య అభిమానుల్ని సంతోష పెట్టాడు. ఇప్పుడు బాలయ్య కోసం ఓ కథ అన్వేషిస్తున్నాడని టాక్. ఈ విషయాన్ని కల్యాణ్‌రామ్ కూడా ఒప్పుకొన్నాడు. ''బాబాయ్ వందో సినిమా మా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కించాలన్న ఆశ ఉంది. అయితే కథ దొరకాలి కదా..? కథ దొరికితే బాబాయ్‌ని ఒప్పిస్తా'' అంటూ తన మనోగతాన్ని వెల్లడించాడు కల్యాణ్‌రామ్. మరి బాబాయ్ బాలయ్య ఏమంటాడో..??