English | Telugu
హీరోయిన్ గా హాట్ యాంకర్..!
Updated : Apr 7, 2016
ఒక తెలుగు మ్యూజిక్ ఛానెల్ లో రాత్రిపూట వచ్చిన ఒక ప్రోగ్రాంలో యాంకర్ గా వచ్చిన జయతి గుర్తుందా.. ఈమెకు అప్పట్లో చాలా మంది ఫ్యాన్స్. విపరీతమైన ఫాలోయింగ్ ఉండటం, మాధురి దీక్షిత్ లా ఉంది అంటూ పొగడ్తలు రావడంతో, ఆ అమ్మడు ఇక సినిమాల్లోకి వెళ్లక తప్పదు అని డిసైడైపోయింది. అది కూడా నిర్మాతగా. రేష్మి, అనసూయ లాంటి యాంకర్లందరూ ఇప్పుడు సినిమాల్లో సక్సెస్ అవడం, హర్రర్ కామెడీ జానర్లకు మంచి ఆదరణ ఉండటంతో, తాను సినిమాల్లోకి రావడం ఇదే కరెక్ట్ టైం అని ఫిక్స్ అయిందీ పాప. తన సొంత నిర్మాణ సంస్థలో, లచ్చి అనే హారర్ కామెడీ జానర్లో సినిమాను నిర్మించింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తనకు మాధురి దీక్షిత్ స్ఫూర్తి అని ఆమెలా నటన, డ్యాన్స్ ల్లో పేరు తెచ్చుకోవాలనుకంటున్నానంటోందీ విజయవాడ అమ్మాయి. యాంకర్ గా ఫ్యామస్ అయ్యాక హీరోయిన్ గా చేయమని అవకాశాలు వచ్చాయని, కానీ తన సొంతంగా సినిమాలు తీసుకోవాలనే ఇంట్రస్ట్ తో వాటికి ఒప్పుకోలేదని, భవిష్యత్తులో కూడా నిర్మాతగా సినిమాలు నిర్మిస్తానని చెబుతోంది. యాంకర్ గా సక్సెస్ అయినట్టుగా, సినిమాల్లో కూడా ఈ అమ్మడు సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.