English | Telugu
ఏప్రిల్ 1న ఎటాక్ చేస్తానంటున్న రాంగోపాల్ వర్మ
Updated : Mar 22, 2016
సెస్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దాదాపు ఏడాది క్రితం ఒక సినిమాను తెరకెక్కించారు. మంచు మనోజ్ పెళ్లవ్వక ముందు నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. రక్త చరిత్ర రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ట్రైలర్ చూసిన తర్వాత మంచి అంచనాలే నెలకొన్నాయి. కానీ ఏమైందో, ఏడాది నుంచీ ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఎట్టకేలకు ఏప్రిల్ 1 కి వర్మ ఎటాక్ కు సరైన ముహూర్తం కుదిరింది. థియేటర్లపై అదే తేదీన ఈ సినిమా ఎటాక్ చేయబోతోంది. ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్లో ధృవీకరించారు.
విచిత్రమేంటంటే షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసేసుకున్న సినిమా రిలీజయ్యే లోపు, వర్మ కిల్లింగ్ వీరప్పన్ రిలీజై హిట్ కొట్టేసింది. మరిన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసేసుకున్నాయి. ఇక ఈసారి వర్మ ప్లాన్ చేసిన ఈ ఎటాక్ కు ఎలాంటి అడ్డంకులూ లేనట్టే కనిపిస్తోంది. రౌడీ, రక్త చరిత్ర తరహాలోనే ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే మాత్రం, సినిమా హిట్టయ్యే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 1న నారా రోహిత్ సావిత్రి తప్పితే, అన్నీ చిన్నవి, డబ్బింగ్ సినిమాలే ఉన్నాయి. సో, వర్మ ఓ మాదిరిగా తీసినా, ఆడియన్స్ పై చేసే ఈ ఎటాక్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది.