English | Telugu
కబాలీ గెటప్ వేసుకున్న చాక్లెట్ రజనీకాంత్
Updated : Mar 22, 2016
అవునండీ. నిజమే. చాక్లెట్ రజనీకాంత్ కావాలని ఉందా..? మీకు చాక్లెట్, రజనీకాంత్ అనే రెండూ పేర్లూ ఇష్టమైతే ఈ ఆఫర్ మీకోసమే మరి. విషయంలోకి వెళ్తే, పాండిచ్చేరిలోని ఓ కేఫ్ ల బిజినెస్ ఉన్న కంపెనీ, రజనీ కబాలీ రిలీజ్ దగ్గరపడుతున్న సందర్భంగా, ఆయన కబాలీ గెటప్ లో చాక్లేట్ తో లైఫ్ సైజ్ చేయించి తమ చైన్ కు సంబంధించిన అన్ని స్టోర్స్ల్ లోనూ పెట్టింది. మీరు చేయాల్సిందల్లా, ఈ చాకో రజనీతో సెల్పీ తీసుకుని, మంచి స్లోగన్ దాని కింద యాడ్ చేసి, ట్వీట్ చేసేయడమే. బెస్ట్ సెల్పీ విత్ స్లోగన్ ను సెలక్ట్ చేసి, వాళ్లకు ఈ ఫుల్ సైజ్ చాకో రజనీని గిఫ్ట్ గా ఇచ్చేస్తారట.
అవునండీ బాబూ..ఈ మొత్తం చాక్లేట్ మీకే. ఆఫర్ అద్దిరి పోయింది కదా. తమిళనాడులో పాలాభిషేకాలు, గుళ్లు మాత్రమే కాదు. ఇలా అభిమాన హీరోను చాక్లేట్ రుచిలో కూడా అందిస్తారు. ఆ రేంజ్ లో ఉంటుంది మరి తమిళ తంబిల అభిమానం. ఈ ఐడియా ఆ రెస్టారెంట్ ఓనర్ కు ఎవరిచ్చారో గానీ, మనోడి పంట పండింది. జనం తండోపతండాలుగా వచ్చేసి సెల్ఫీలు తీసుకోవడమే కాక, ఖాళీ లేనంతగా వీళ్ల చైన్ హోటల్స్ నిండిపోతున్నాయంట. రజనీ మానియా అలాగే ఉంటుంది మరి..