English | Telugu

అమితాబ్ బచ్చన్ కు మద్దతిచ్చిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగిన కోల్ కతా మ్యాచ్ లో జనగణమన పాడటానికి అమితాబ్ బచ్చన్ ను ఆహ్వానించింది బెంగాల్ క్రికెట్ ఆసోసియేషన్ క్యాబ్. ఆ రోజు మ్యాచ్ లో ఇండియా గెలిచింది. కానీ జనగణమన పాడిన అమితాబ్ పై మాత్రం కేసు నమోదైంది. అమితాబ్ జనగణమన తప్పుగా పాడారని పి.ఆర్.ఉల్లాస్ అనే వ్యక్తి ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ పిఎస్ లో కంప్లైంట్ రిజిస్టర్ చేశాడు. జాతీయగీతాన్ని ఎగ్జాక్ట్ గా 52 సెకన్లలో పాడాలని, అమితాబ్ మాత్రం 18 సెకన్లు ఎక్కువగా పాడారని, మంగళ దాయక అనకుండా మంగళనాయక అని తప్పు పాడారని ఫిర్యాదు సారాంశం.

అయితే దీనికి వ్యతిరేకంగా అమితాబ్ కు దేశవ్యాప్తంగా సపోర్ట్ లభిస్తోంది. ఆయన అద్భుతంగా పాడారంటూ సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అయితే, అమితాబ్ రాగయుక్తంగా, పెర్ఫెక్ట్ పిచ్ లో, స్పష్టమైన ఉచ్ఛారణలో పాడారని, ఆయన పాడిన విధానానికి తానెంతో గర్వించానని తన ఫేస్ బుక్ లో వ్యాఖ్యానించారు. ఒకవేళ లేటుగా పాడటం నేరం అయితే, లతా మంగేష్కర్, భీమ్ సేన్ జోషీ, తాను ఇంకా చాలా మంది కలిసి చేసిన జనగణమన ఆల్బమ్ డ్యూరేషన్ గురించి ఎవరూ ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు.

కోర్టులు ఇప్పటికే చాలా తీవ్రమైన కేసుల్ని పరిష్కరించే పనుల్లో బిజీగా ఉన్నాయని, ఇలాంటి వృథా ప్రయత్నంతో కోర్టు సమయాల్ని వృథా చేయడం కరెక్ట్ కాదని హితవు పలికారు ఎస్పీబీ. ఆయన చెప్పిన దానికి కూడా సోషల్ నెట్ వర్కింగ్ లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ట్విట్టర్లో రీట్వీట్లు, ఫేస్ బుక్ లో షేరింగ్ చేస్తూ నెటిజన్లు అమితాబ్ కు తమ సపోర్ట్ ను తెలియజేస్తున్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.