English | Telugu

వ‌ర్మ మారిపోయాడ‌ట‌

సినిమాని చీప్‌గా తీసేసి, చిప్‌ట్రిక్స్‌తో భారీ ప‌బ్లిసిటీ ఇచ్చుకొని త‌న సినిమాని తెలివిగా మార్కెటింగ్ చేసుకొంటుంటాడు వ‌ర్మ‌. రెండు ల‌క్ష‌ల్లో కూడా సినిమా తీయ‌గ‌ల స‌మ‌ర్థుడాయ‌న‌. సినిమా తీయాలంటే అస‌లు బ‌డ్జెట్టే అవ‌స‌రం లేద‌ని వాదించ‌గ‌ల‌డు.. నిరూపించ‌గ‌ల‌డు కూడా. అయితే ఇలాంటి వ‌ర్మ ఇప్పుడు మారిపోయాడ‌ట‌. చిన్న సినిమాల జోలికి అస్స‌లు వెళ్ల‌కూడ‌ద‌ని గ‌ట్టిగా డిసైడ‌య్యాడ‌ట‌. 'ఎటాక్‌' సినిమా మొద‌లుకొని, అన్ని పెద్ద సినిమాలే చేయాల‌ని తీర్మాణించుకొన్నాడ‌ట‌. చిన్న సినిమాలు తీసుకొంటూ పోతే... త‌న పేరూ, ప‌ర‌ప‌తి పోతోంద‌న్న నిజం వ‌ర్మ ఇప్పుడు తెలుసుకొన్నాడేమో..?? అంతేకాదు... దెయ్యాల క‌థ‌లూ, ఒక ఇంటి చుట్టూ తిరిగే హార‌ర్ చిత్రాలు ఇక తీయ‌కూడ‌ద‌ని వ‌ర్మ అనుకొంటున్నాడ‌ట‌. అందుకే ఎటాక్ సినిమాకోసం భారీ గా ఖ‌ర్చు పెట్టిస్తున్నాడ‌ట‌. హైదరాబాద్‌లోని పురానాపూర్ బ్రిడ్జ్‌పై రైన్ ఎఫెక్ట్‌తో ఓ యాక్ష‌న్ సీన్ డిజైన్ చేశాడు వ‌ర్మ‌. ఈ ఒక్క ఎపిసోడ్ బ‌డ్జెట్ రూ.30 ల‌క్ష‌ల‌ట‌. ఆ డ‌బ్బుల‌తో ఇది వ‌ర‌కు సినిమానే తీసేసేవాడు వ‌ర్మ‌. ఈ విధంగా చూస్తే వ‌ర్మ మారిన‌ట్టే లెక్క‌.