English | Telugu

యువ హీరోకి షాకిచ్చిన తెలుగ‌మ్మాయ్‌

తెలుగ‌మ్మాయి నందిత గ‌డుసుదే. ప్రేమ‌క‌థాచిత్ర‌మ్‌, ల‌వ‌ర్స్ సినిమాల‌తో హిట్లు కొట్టింది నందిత‌. ఆ హిట్లు వెనుక ఉన్నాయ‌న్న తెగువో... ఏమోగానీ మాట్లాడేముందు కాస్త ముందూ వెనుకా ఆలోచించడం మ‌ర్చిపోయింది. అలా త‌న చిత్తం వ‌చ్చిన‌ట్టు మాట్లాడి యువ హీరో హ‌వీష్ కి షాకిచ్చింది. వీళ్లిద్దరూ క‌ల‌సి న‌టించిన చిత్రం 'రామ్‌లీల‌'. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా హ‌వీష్ - నందిత‌ల ఇంట‌ర్వ్యూలు ఏర్పాటు చేశారు. మీడియా ఉండ‌గా.. హీరో హ‌వీష్ ప‌రువు తీసింది నందిత‌. ''మీరు ప్ర‌స్తుతం కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రినీ, రామ్‌లీల చేశారు క‌దా. వీటిలో మీ మ‌న‌సుకి న‌చ్చిన సినిమాఏది?'' అని అడిగారు. మ‌రెవ‌రైనా అయితే నాకు రెండూ ఇష్ట‌మే అనో, లేదంటే ప‌క్క‌నే హ‌వీష్ ఉన్నాడ‌ని 'రామ్‌లీల అంటేనే ఇష్టం' అనో చెబుతారు. కానీ నందిత అలాకాదు. ''నాకు రామ్‌లీల కంటే... కృష్ణ‌మ్మ‌క‌లిపింది ఇద్ద‌రినీ సినిమా అంటేనే ఇష్టం.'' అని నోరు జారింది. అంతేనా...?? ''హ‌వీష్ కంటే సుధీర్ బాబుతో న‌టించ‌డ‌మే చాలా తేలిక‌. ఎందుకంటే త‌న‌తో నేను ఓ సినిమా చేశా. మా ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగుంటుంది'' అనేసింది. ఆ స‌మ‌యంలో చూడాలి.. ప‌క్క‌నే ఉన్న కుర్ర‌హీరో హ‌వీష్ మొహం మాడిపోయింది. అయినా ఏం చేస్తాడు...?? చేసేదేం లేక కామ్‌గా ఉండిపోయాడు. హీరోలంద‌ర్నీ పొడ‌గ‌డాల్సిందే అన్న ప్రాధ‌మిక సూత్రం నందిత ఎప్పుడు నేర్చుకొంటుందో??