English | Telugu

కెమెరామెన్ విన్సెంట్ క‌న్నుమూత‌

సీనియ‌ర్ ఛాయాగ్ర‌హ‌కుడు ఎ.విన్సెంట్ (83) క‌న్నుమూశారు. కొద్ది సేప‌టిక్రితం ఆయ‌న‌ చెన్నైలో గుండెపోటుతో మ‌ర‌ణించారు. ప‌లు తెలుగు, త‌మిళ‌ హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్రాల‌కు ప‌నిచేశారాయ‌న‌. త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అటు చాయాగ్ర‌హ‌కుడిగా, ఇటు ద‌ర్శ‌కుడిగా రెండు పాత్ర‌లు పోషించారుజ తెలుగులో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు ఆయ‌న ఖాతాలో ఉన్నాయి. ముఖ్యంగా కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప‌లు చిత్రాల‌కు ఆయ‌న కెమెరామెన్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఆప‌ద్భాంధ‌వుడు, బాబు, దేవ‌త‌, మేజ‌ర్ చంద్ర‌కాంత్‌, అల్ల‌రిప్రియుడు, ఘ‌రానా మొగుడు, అన్న‌మ‌య్య‌... ఇలా ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌కు ప‌నిచేశారాయ‌న‌. 1985 లోనే ఓ మ‌ల‌యాళ చిత్రం ద్వారా త్రీడీ ఎఫైక్ట్స్‌ని ప‌రిచ‌యం చేశారాయ‌న‌. ద‌ర్శ‌కుడి భావాల‌ను అనుగుణంగా క‌థ‌ని తెర‌పై క‌ళాత్మ‌కంగా తెర‌కెక్కించ‌డంలో విన్సెంట్ ప్ర‌సిద్ధుడు. ఆయ‌న మ‌ర‌ణం.. యావ‌త్ చిత్ర‌సీమ‌కూ తీర‌ని లోటు.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.