English | Telugu

వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్

వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించటానికి అంగీకరించారని సమాచారం. ఇప్పటికే సంపత్ నంది దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక చిత్రంలో నటించటానికి అంగీకరించారు. సంపత్ నంది దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించబోయే ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ నటించబోయే ఈ చిత్రానికి "రచ్చ" అనే పేరుని నిర్ణయించారు.

ఈ చిత్రం తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటించటానికి సన్నాహాలు జరుగుతున్నాయని వినపడుతోంది. తండ్రి మెగాస్టార్ తో "ఠాగూర్" వంటి బ్లాక్ బస్టర్ హిట్టిచ్చిన వినాయక్ కొడుకు రామ్ చరణ్ కి ఇంకెంత పెద్ద హిట్టిస్తాడోనని సినీ జనం అనుకుంటున్నారు. రామ్ చరణ్, వినాయక్ కాంబినేషన్ లో రాబోయే ఈ చిత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల అంచనాలను అందుకుంటుందని చెప్పవచ్చు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం