English | Telugu
అంబానీ ఇంట పెళ్ళికి ఏడు కోట్ల కారులో రామ్ చరణ్!
Updated : Jul 11, 2024
ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ (Anant Ambani) వివాహం ఘనంగా జరుగుతోంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో జరుగుతున్న అనంత్ - రాధికా మర్చంట్ పెళ్లి వేడుకకు వివిధ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు తరలివెళ్లారు. టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఈ వివాహ వేడుకకు హాజరవ్వడం విశేషం.
తన సతీమణి ఉపాసన, కుమార్తె క్లీంకార తో కలిసి హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ముంబైకి వెళ్లారు రామ్ చరణ్. అయితే హైదరాబాద్ లోని తన ఇంటి నుంచి ఎయిర్ పోర్ట్ వరకు తన కొత్త రోల్స్ రాయిస్ స్పెక్టర్ కారులో వచ్చారు చరణ్. దీని ఖరీదు రూ.7 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఇలాంటి కారు అతి కొద్ది మంది మాత్రమే కలిగి ఉన్నారని సమాచారం.