English | Telugu
అతనితో రాత్రంతా ఎంజాయ్ చేశా.. రకుల్
Updated : Apr 5, 2016
నేను, క్రికెటర్ బ్రెట్‌లీ కలిసి రాత్రంతా ఎంజాయ్ చేశామంటూ తన ట్విట్టర్లో తెలిపింది టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరూ రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ కి, బ్రెట్ లీ కి సంబంధం ఏంటనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య ఓ ఫిట్నెస్ సెంటర్‌ను ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. అయితే వరల్డ్ వైడ్ గా చాలా ఫ్రాంచైంజ్లు ఉన్న తనకు ఆస్త్రేలియన్ ఫిట్నెస్ కంపెనీ ఎఫ్ 45లో రకుల్ ప్రీత్ సింగ్ పార్టనర్‌గా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్, బ్రెట్‌లీలు ఇద్దరూ కూడా ఎఫ్45 మెంబర్స్ అవడంతో ఇద్దరికీ రిలేషన్‌షిప్ కుదిరింది. దీంతో వరల్డ్ టీ20 టోర్నమెంట్లో భాగంగా.. ఆస్ట్లేలియా టీమ్ ఇండియాకు రాగా.. రకుల్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ తో బ్రెట్లీ తన పిట్నెస్ సెంటర్ కు వచ్చాడట. ఇక అక్కడ రకుల్ ప్రీత్ సింగ్, బ్రెట్లీతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ కలసి రాత్రి పొద్దుపోయేదాకా జిమ్‌లో ఎంజాయ్ చేశారట. ఇదే విషయాన్ని తను తన ట్విట్టర్లో పోస్ట్ చేసి హ్యాపీగా ఫీలయింది.