English | Telugu
సన్నీ లియోన్ పై వంద కోట్లకు పరువు నష్టం దావా..!
Updated : Apr 5, 2016
సన్నీ లియోన్ పై పరువు నష్టం కేసు నమోదైంది. బిగ్ బాస్ కంటెస్టెంట్, మోడల్ పూజా మిశ్రా, సన్నీ పై బోంబే హైకోర్టులో వంద కోట్లకు పరువునష్టం దావా వేసింది. బిగ్ బాస్ ఐదో సీజన్లో తాను కంటెస్టెంట్ నని, తన తర్వాత సన్నీ లియోన్ కూడా షోలోకి ఎంటరైందని, తనమీద అసూయా ద్వేషాలతో మీడియా ఇంటర్వ్యూల్లో తన పరువు ప్రతిష్టలను దిగజార్చే విధంగా మాట్లాడిందని పూజా మిశ్రా ఆరోపిస్తోంది. సన్నీ ఇచ్చిన ఇంటర్వ్యూల వల్ల తనకు నష్టం వాటిల్లిందని, వ్యక్తిగతంగా ఆర్థికంగా చాలా నష్టపోయానని, 100 కోట్లు పరిహారం ఇప్పించి, తనకు న్యాయం చేయాలని కోర్టుకు విన్నవించుకుంది.
తనపై సన్నీ ఈర్ష, ఆసూయలతో కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేసింది, పబ్లిక్ లో తనుకున్న ఇమేజ్ ను దెబ్బతీసింది అనేవి పూజా మిశ్రా ఆరోపణలు. సన్నీ ఇచ్చిన ఇంటర్వ్యూ ఒక పేపర్లో రావడంతో, తన ఫిక్స్ డ్ డిపాజిట్లన్నింటినీ వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని, అందువల్ల దాదాపు 70 లక్షలు నష్టం వాటిల్లిందని తన దావాలో పేర్కొంది. ఐపిసి 500 120(బి) సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. హైకోర్టు వేసవి సెలవులు ముగిసే వరకూ, కేసును వాయిదా వేసింది. కాగా ఈ కేసుపై సన్నీ ఇంకా స్పందిచాల్సి ఉంది.