English | Telugu
రజనీ కబాలీకి విడుదలవ్వక ముందే లాభాలు
Updated : Mar 11, 2016
జయాపజయాలకు అతీతంగా కలెక్షన్లు రాబట్టే హీరోని సూపర్ స్టార్ అంటారు. సినిమా ఫలితాలకు సంబంధం లేకుండా తన ప్రతీ సినిమాకు థియేటర్లకు జనాన్ని రప్పించగల కెపాసిటీ సౌత్ ఇండియాలో ఒక్క రజనీకి మాత్రమే సాధ్యం అనడంతో ఆశ్చర్యం లేదు. ఆయన లేటెస్ట్ సినిమా కబాలీ కూడా ఇదే సూత్రమ్మీద లాభాల బాట పట్టింది. వరసగా విక్రమ సింహ, లింగా లు దెబ్బ కొట్టడంతో, కబాలీని వీలైనంత తక్కువ బడ్జెట్లో పూర్తి చేయమని రజనీ ముందే చెప్పారట. దాంతో 70 కోట్ల బడ్జెట్లో సినిమాను రౌండప్ చేశారు.
తెలుగు తమిళ భాషలతో పాటు, హిందీలో కూడా రజనీకాంత్ కు స్టార్ ఇమేజ్ ఉంది. ఇదే ఇప్పుడు ప్రొడ్యూసర్లకు ప్లస్ అయింది. రజనీ క్రేజ్ తో దాదాపు 150 కోట్ల వరకూ ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అంటే దాదాపు పెట్టుబడికి డబుల్ ఆదాయం వచ్చేసినట్టే. ఇంకా శాటిలైట్ రైట్స్ ను బిజినెస్ చేయలేదు. అది కూడా కలుపుకుంటే, సినిమాకు లాభాల పంట పండిందనే చెప్పాలి. సినిమా జూన్ మొదటివారంలో రిలీజవబోతోందని సమాచారం.