English | Telugu
త్రివిక్రమ్ సినిమా ' అ..ఆ ' ఫస్ట్ లుక్ వచ్చేసింది
Updated : Mar 11, 2016
ఇప్పుడున్న దర్శకుల్లో త్రివిక్రమ్ శైలి వేరు. ఆయన డైలాగులే కాక, సినిమాలు కూడా చాలా క్లాస్ గా ఉంటాయి. ప్రస్తుతం ఆయన నితిన్, సమంత జంటగా అ..ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా తన సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు త్రివిక్రమ్. చూడగానే, సినిమా మంచి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ అని అర్ధమయ్యేలా ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది. బండిలో కూర్చుని సమంత చిలిపి నవ్వులు నవ్వుతుంటే, పక్కనే పొలం గట్టు మీద నితిన్ నడుస్తున్నాడు.
చూడబోతే సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగే మంచి ప్రేమకథలా అనిపిస్తోంది. సినిమా పేరు కూడా అందుకు తగ్గట్టే అనసూయ రామలింగం వెర్సస్ ఆనంద్ విహారి అని పెట్టారు. సింపుల్ గా అ..ఆ అంటూ తెలుగు అక్షరాలను పెట్టి త్రివిక్రమ్ తన రచనా పటిమను చాటుకున్నాడు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాథాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 6 న ప్రేక్షకులు ముందుకు రావడానికి అ..ఆ రెడీ అవుతోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా, నితిన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ కావడం విశేషం.