English | Telugu

ప‌వ‌న్‌... ఈ క‌న్‌ఫ్యూజ‌నేంటి??

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ రిలీజ్ విష‌యంలో ఇప్ప‌టికే ఎన్నో సందేహాలు అభిమానుల్ని వేధిస్తున్నాయి. అస‌లు ఈ సినిమా అంతా అనుకొంటున్న‌ట్టు ఏప్రిల్ 8న వ‌స్తుందా, రాదా? లేదంటే ఓ రెండు వారాలు వాయిదా ప‌డుతుందా? అనే క‌న్‌ఫ్యూజ‌న్ నెల‌కొంది. నిర్మాత శ‌ర‌త్ మ‌రార్‌.. ఎంత నిబ్బ‌రంగా చెబుతున్నా.. ఈ సినిమా విడుద‌ల ఇంకా డౌటే. ఎందుకంటే మ‌రో ప‌దిహేను రోజుల షూటింగ్ బాకీ ఉంది. ఆర్‌,ఆర్ ఎడిటింగ్ ఇలాంటి ప‌నులున్నాయి. ఆడియో ఫంక్ష‌న్ చేయాలి. సెన్సార్ కోసం సినిమా సిద్ధం చేయాలి. ఇలా ఎన్ని ప‌నులో. ప‌వ‌న్‌కి ఎప్పుడు మూడొస్తుందో, ఎప్పుడు పారిపోతుందో తెలీదు. ఫామ్ హోస్ కి వెళ్లి నాలుగు రోజులు త‌లుపు వేసుకొని కూర్చున్నాడంటే... ఇక అంతే సంగ‌తులు. కాబ‌ట్టి ఏప్రిల్ 8న స‌ర్దార్ సినిమా రావ‌డం ఇంకా డౌటే.

ఇప్పుడు ఆడియో ఫంక్ష‌న్‌పైనా అనుమానాలు నెల‌కొన్నాయి. ఈనెల 20న ఆడియో ఫంక్ష‌న్ జ‌రుగుంద‌ని నిర్మాత‌లు చెబుతున్నారు. అయితే.. ఈ డేటు ఇంకా ఖ‌రారు కాలేద‌ట‌. 18న‌గానీ 20న గానీ 22న‌గానీ చేసే అవ‌కాశాలున్నాయ‌ట‌. వేదిక విష‌యంలోనూ గంద‌ర‌గోళం నెల‌కొంది. నిజాం కాలేజీలో చేయాల‌న్న‌ది ప‌వ‌న్ ఆలోచ‌న‌. గ‌చ్చిబౌలి స్టేడియం నీ ప‌రిశీలిస్తున్నారు. ఈ రెండింటిలో వేదిక ఏమిట‌న్న‌ది క‌న్‌ఫ్యూజ‌నే. చిరంజీవిని ఫంక్ష‌న్‌ని పిల‌వాలా, లేదంటే... కేవ‌లం స‌ర్దార్ టీమ్ తో కానిచ్చేయాలా?? అనే సందేహాల్లో ఉన్నాడ‌ట ప‌వ‌న్‌. త‌మ్ముడి ఆడియో ఫంక్ష‌న్‌కి అన్న‌య్య చిరంజీవి రావ‌డం బొత్తిగా త‌గ్గిపోయింది. అయితే ఈమ‌ధ్య ఈ అన్నాద‌మ్ములిద్ద‌రూ మ‌ళ్లీ క్లోజ‌య్యారు. ప‌వ‌న్ పిలిస్తే... చిరు వ‌స్తాడు. కానీ.. ప‌వ‌నే పిల‌వాలా, వ‌ద్దా? అనే ఆలోచ‌న‌ల్లో ఉన్నాడ‌ట‌. అలా.. స‌ర్దార్ చుట్టూ అనేక సందేహాలు నెల‌కొన్నాయి. వీటికి ప‌వ‌న్ ఎంత వీలైతే అంత త్వ‌ర‌గా సమాధానాలు వెత‌కాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.