English | Telugu
రజనీ అదరగొట్టేశాడు
Updated : Dec 16, 2014
రజనీ కాంత్ అంటేనే అంత. అద్భుతాలు సైతం అతని వంక వింతగా చూస్తుంటాయ్. లింగ రికార్డులే ఇందుకు నిదర్శనం. లింగలో విషయం ఏమీలేదని విమర్శకులు సైతం తేల్చేశారు. ఇదో పాత చింతకాయ్ పచ్చడని, మూడు గంటల హింస అని ఘాటుగా విమర్శించారు. అయితే అభిమానులు మాత్రం.. తలైవా తలైవా.. అంటూ ఈ సినిమాని భుజాలనెత్తుకొన్నారు. మూడు రోజుల్లోనూ దాదాపుగా రూ.75 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.30 కోట్లు రాబట్టిందట. ఇది సరికొత్త సౌత్ ఇండియన్ రికార్డు. ఓవర్సీస్‌లో అన్ని రికార్డులను రజనీ చితగ్గొట్టేస్తున్నాడన్న టాక్ వినిపిపిస్తోంది. ''ఈ జోరెంత సేపూ.. సోమవారం నుంచి వసూళ్లు నేలకు దిగడం ఖాయం'' అని విమర్శకులు చెబుతున్నారు. మొత్తానికి తొలి మూడు రోజుల్లో రజనీ అద్భుతాలు సృష్టించాడు. మరి ఈ జోరు ఆగుతుందా? లేదంటే ఈరోజు కూడా రజనీ దూకుడు చూపిస్తాడా అన్నది బాక్పాఫీసు రిపోర్టులే చెప్పాలి.