English | Telugu
చక్రి అంత్యక్రియలు పూర్తి
Updated : Dec 15, 2014
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. పంజాగుట్టలోని హిందూ స్మశాన వాటికలో ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు. చక్రి అంతిమయాత్ర జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసం వద్ద నుంచి ప్రారంభమైంది. అంతిమయాత్రలో అభిమానులు, బంధువులు పాల్గోని చక్రికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆదివారం రాత్రి ఆయనకు గుండెపోటు రాగా.. అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు.
చక్రి పూర్తి పేరు చక్రధర్ గిల్లా. 1974 జూన్ 15న వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంభాలపల్లిలో జన్మించాడు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ‘బాచి’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన చక్రి.. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, సత్యం, గోపి గోపిక గోదావరి, దేశముదురు, సింహా లాంటి మ్యూజికల్ హిట్స్‌కు సంగీతాన్నందించాడు. చిరంజీవి, వెంకటేష్ మినహాయిస్తే అందరు టాప్ స్టార్స్‌తోనూ సినిమాలు చేశాడు. చక్రి చివరి సినిమా ‘ఎర్రబస్సు’. గత నెలలోనే ఈ సినిమా విడుదలైంది.