English | Telugu
షాక్‌కి గురి చేస్తున్న రవిబాబు స్ట్రాటజీ
Updated : Dec 16, 2014
రవిబాబుది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రచారానికి పెద్దగా ప్రాధన్యం ఇవ్వడు. సినిమా అంతా ఒక్క పోస్టర్‌తోనే నడిపించేస్తాడు. అవును విషయంలోనూ ఇదే జరిగింది. పూర్ణని లొంగదీసుకోవాలనుకొన్న ఓ ఏనుగు బొమ్మ ని సృష్టించి ఆ సినిమాకి ఆ ఒక్క పోస్టరే వాడుకొన్నాడు. ఇప్పుడు అవును 2కీ అదే పంథాలో వెళ్తున్నాడు. అంతేకాదు, ''నా సినిమాకి పబ్లిసిటీ అవసరం లేదు. రకరకాల పోస్టర్లు పెట్టి నేనెవరినీ కన్‌ఫ్యూజ్ చేయాలనుకోవడం లేదు. సినిమాపేరు, నటీనటుల సంగతి అర్థమైతే చాలు...'' అంటున్నాడట. అంతేకాదు అవును 2 విషయంలో పబ్లిసిటీ లేకుండా సినిమాని రంగంలోకి దింపుదామనుకొంటున్నాడట. ఈ సినిమాఎప్పుడో పూర్తయింది. ఏవారం థియేటర్లు ఖాళీగా ఉన్నాయో చూసుకొని, నాలుగు రోజుల ముందు పబ్లిసిటీ మొదలెట్టి.. సినిమాని రిలీజ్ చేసేద్దామనుకొంటున్నాడు. ఈచిత్రానికి సురేష్ బాబు నిర్మాత. ఆయన తలచుకొంటే థియేటర్లకు కొదవ ఉండదు. అయినా సరే, రవిబాబు ఈతరహా స్ట్రాటజీని ఎంచుకోవడం పరిశ్రమ వర్గాల్ని షాక్‌కి గురిచేస్తోంది. మరి ఈ వింత పోకడ వర్కవుట్ అవుతుందంటారా??