English | Telugu
రాజమోళి తండ్రిపై అరెస్టు వారెంటు జారీ
Updated : May 30, 2014
టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పై అరెస్టు వారెంటు జారీ అయినట్లు సమాచారం. చెక్ బౌన్సు అయిన వ్యవహారంలో యలమంచిలి కోర్టు ఈ వారెంటు జారీ చేసినట్లు తెలుస్తోంది. నిర్మాత చెంగల వెంకట రావుకు 30 లక్షల మొత్తం చెల్లింపుకై విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయినందుకు ఆయన ఈ కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా పూర్తి వివరాలు అందవలసి వుంది.