English | Telugu

భాదతో హాస్పిటల్ లో ఉన్న కాంచన

రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన "ముని", "కాంచన" చిత్రాలు ఎంతటి విజయం సాధించాయో అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం "ముని-3" షూటింగ్ జరుగుతుంది. లారెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. ఇటీవలే ఈ చిత్ర సాంగ్ రిహార్సల్ సమయంలో లారెన్స్ మెడ, కాలు అనుకోకుండా పెయిన్ తో భాద పడడంతో హాస్పిటల్ కు తరలించారు. మరో మూడు నెలల వరకు విశ్రాంతి తీసుకోవాలని అక్కడి వైద్యులు సూచించారు. అందువల్ల ఈ చిత్ర షూటింగ్ మరో మూడు నెలల వరకు ఆగిపోయే పరిస్తితి నెలకొంది. మరి త్వరగా లారెన్స్ కోలుకొని, షూటింగ్ ప్రారంభిస్తే అటు నిర్మాత, ఇటు అభిమానులు అందరూ సంతోషిస్తారు.