English | Telugu

లెజెండ్ హీరోయిన్‌పై పాకిస్తానీయుల దాడి




రాధిక ఆప్టే పెద్ద గండం నుంచి బయటపడింది. హిందీతో సహా పలు భాషా చిత్రాల్లో నటిస్తున్న రాధిక ఆప్టే తెలుగు ప్రేక్షకులకు లెడెండ్ సినిమా ద్వారా దగ్గర అయింది. గతంలో రక్త చరిత్రలో కూడా నటించింది.తమిళ చిత్రం షూటంగ్ కోసం యూనిట్ తో సహా కాశ్మీర్‌కు వెళ్లిన రాధికకు ఒక చేదు అనుభవం ఎదురయింది. కాశ్మీర్‌లోని బెహెర్‌గాం, గాబామార్గ్ లో షూటింగ్ నిర్వహిస్తుండగా, ఆ ప్రాంతానికి చెందిన కొందరు యూనిట్ వాళ్లను ఆటంకపరిచారట. మీరు భారతీయులు ఇక్కడెలా షూటింగ్ నిర్వహిస్తారంటు యూనిట్‌ని బెదిరించడం మొదలుపెట్టారట.కాసేపటి తర్వాత చిత్ర యూనిట్ పైకి వారు కర్రలతో వచ్చి దాడి చేయటం మొదలుపెట్టారట. ఈ దాడి నుంచి రాధిక తృటిలో తప్పించుకుందట.
అంతలో సమీపంలో గల సిక్కులు వచ్చి కాపాడటంతో చిత్ర యూనిట్ మొత్తం ప్రాణాలతో బయటపడ్డారట. భారత సరిహద్దు ప్రాంతంలోనే షూటింగ్ చేస్తున్నప్పటికీ ఇలా దాడి జరగటంపై యూనిట్ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.