English | Telugu

సోనాక్షి ఆ రోజంతా అతడితో గడిపిందట

బాలీవుడ్ లో సోగ కళ్ల సోనాక్షి హవా తెగ నడుస్తోంది. సల్మాన్, అక్షయ్ కుమార్ లతో ఆమె హీరోయిన్ గా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వరుసగా విజయాలు సాధించాయి. దీంతో స్టార్ హీరోయిన్ల స్థానాన్ని తక్కువ సమయంలోనే సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ సోలోగా వుంటే ఇమేజ్ ఆవరేజ్ గా వుంటుంది. అదే ఎవరితోనైనా జంట కడితే పాపులారిటి ఎక్కువవుతుంది. ఇదలా వుంచితే సోనాక్షి కూడా జంట పక్షిగా కనిపిస్తోంది. ఈ మధ్యే జరిగిన తన పుట్టిన రోజున షాహిద్ తో ప్రత్యేకంగా సమయం గడిపిందని ముంబాయి మీడియా తెగ వార్తలు రాసేసింది. షాహిద్ గతంలో కరీనా, ప్రియాంకలతో ప్రేమ వ్యవహారాలు నడిపాడు. తాజాగా సోనాక్షి ఆ లిస్టులో చేరింది. నిన్నటి తరం నటుడు శత్రుఘ్న సిన్హా కూతురు అయిన సోనాక్షికి పరిశ్రమలో గుడ్ గర్ల్ టైటిల్ వుండేది. తాజా వ్యవహారంతో ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదా సోనాక్షికి అని వాపోతున్నారు. వీరిద్దరూ కలిసి ఆర్.రాజ్ కుమార్ చిత్రంలో నటించారు.