English | Telugu

`భీమ్లా నాయ‌క్`, `రాధే శ్యామ్`.. సేమ్ టు సేమ్!

`భీమ్లా నాయ‌క్`, `రాధే శ్యామ్`.. 2022 సంక్రాంతి బ‌రిలో కేవ‌లం ఒక్క రోజు గ్యాప్ లో సంద‌డి చేయ‌నున్న చిత్రాలు. జ‌న‌వ‌రి 12న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ రోల్ లో న‌టించిన `భీమ్లా నాయ‌క్` రిలీజ్ కానుండ‌గా.. జ‌న‌వ‌రి 14న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన పాన్ - ఇండియా మూవీ `రాధే శ్యామ్` విడుద‌ల కానుంది.

అడ‌వి బాట‌లో అప్ క‌మింగ్ తెలుగు క్రేజీ ప్రాజెక్ట్స్!

ఇదిలా ఉంటే.. ఈ రెండు సినిమాల‌కి సంబంధించి ఓ విష‌యంలో కామ‌న్ ఫ్యాక్ట‌ర్ ఉందంటున్నారు. అదేమిటంటే.. ర‌న్ టైమ్!. ఇప్ప‌టికే `భీమ్లా నాయ‌క్` చిత్ర నిడివి 2 గంట‌ల 20 నిమిషాల పాటు ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా.. `రాధే శ్యామ్` డ్యూరేష‌న్ కూడా అంతే ఉంటుంద‌ని తెలిసింది. కాక‌పోతే, హిందీ వెర్ష‌న్ మాత్రం మ‌రో ప‌ది నిమిషాలు అద‌నంగా ఉంటుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ రెండు చిత్రాల నిడివికి సంబంధించి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. మ‌రి.. ర‌న్ టైమ్ విష‌యంలో సేమ్ టు సేమ్ అన్న‌ట్లుగా ఉన్న `భీమ్లా నాయ‌క్`, `రాధే శ్యామ్`.. బాక్సాఫీస్ ముంగిట ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటాయో చూడాలి.

2022 సంక్రాంతికి రాబోతున్న‌ పాన్ - ఇండియా మూవీస్ స్పెషాలిటీ అదే!

కాగా, `భీమ్లా నాయ‌క్`కి సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, `రాధే శ్యామ్`ని `జిల్` ఫేమ్ రాధాకృష్ణ రూపొందించారు.