
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కో సమయంలో ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. ప్రస్తుతం యాదృచ్ఛికంగా అలాంటి ట్రెండ్ ఒకటి కనిపిస్తోంది. అదేమిటంటే.. విడుదలకు సిద్ధమైన పలు క్రేజీ ప్రాజెక్ట్స్ అడవి బాట పట్టడం.
ఆ వివరాల్లోకి వెళితే.. వచ్చే వారం థియేటర్స్ లోకి రానున్న అల్లు అర్జున్ సినిమా `పుష్ప - ద రైజ్` ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే చిత్రంగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కగా.. జనవరి 7న విడుదల కానున్న మరో పాన్ - ఇండియా మూవీ `ఆర్ ఆర్ ఆర్` కూడా అడవి నేపథ్యంతోనే రాబోతోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇందులో హీరోలుగా నటించారు. ఇక పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటించిన `భీమ్లా నాయక్` కూడా అటవీ ప్రాంతంలో సాగే కథే. అంతేకాదు.. చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న `ఆచార్య` కూడా నక్సలిజం టచ్ తో కొంతమేర ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగబోతోందని ప్రచార చిత్రాలని బట్టి స్పష్టమవుతోంది. ఇక విడుదలకు సిద్ధమైన పిరియడ్ డ్రామా `విరాట పర్వం` కూడా ఈ తరహా సినిమానే.
మరి.. తక్కువ గ్యాప్ లోనే రాబోతున్న ఈ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ మూవీస్.. ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.






