Home

»

Latest News

2022 సంక్రాంతికి రాబోతున్న‌ పాన్ - ఇండియా మూవీస్ స్పెషాలిటీ అదే!

Dec 04, 2021

2022 సంక్రాంతికి వారం గ్యాప్ లో రెండు పాన్ - ఇండియా మూవీస్ సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 7న `ఆర్ ఆర్ ఆర్` విడుద‌ల కానుండ‌గా.. జ‌న‌వ‌రి 14న `రాధే శ్యామ్` తెర‌పైకి రానుంది.

ఇదిలా ఉంటే.. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ రెండు పాన్ - ఇండియా ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా పిరియ‌డ్ ట‌చ్ తో సాగే చిత్రాలే. చారిత్ర‌క పురుషులు అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీమ్ స్నేహం చుట్టూ అల్లుకున్న హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ గా 1920ల‌ నాటి క‌థాఇతివృత్తంతో `ఆర్ ఆర్ ఆర్` రూపొంద‌గా.. 1970ల నాటి కాలంలో ఇటలీ నేప‌థ్యంలో సాగే పిరియ‌డ్ ల‌వ్ సాగాగా `రాధే శ్యామ్`ని తీర్చిదిద్దారు. మ‌రి.. పిరియ‌డ్ డ్రామాలుగా తెర‌కెక్కిన ఈ పాన్ - ఇండియా మూవీస్.. గ‌తంలోకి తీసుకెళ్ళి  మ‌రీ ప్రేక్ష‌కుల‌ను ఏ స్థాయిలో మంత్ర‌ముగ్ధుల‌ను చేస్తాయో చూడాలి.

కాగా, ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ ఆర్ ఆర్`లో యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టించ‌గా.. `జిల్` రాధాకృష్ణ తెరకెక్కించిన `రాధే శ్యామ్`లో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరో.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com