English | Telugu

అక్క‌డ నేనొక‌దాన్ని ఉన్నాన‌నే ధ్యాస‌లేకుండా తార‌క్‌, చ‌ర‌ణ్ తెగ క‌బుర్లు చెప్పుకునేవారు!

శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన 'ఆర్ఆర్ఆర్' ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో ఓ అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ఆలియాను మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్న‌లు అడిగే స‌మ‌యంలో డైరెక్ట‌ర్ రాజ‌మౌళి జోక్యం చేసుకొని, ఆలియాను త‌నో ప్ర‌శ్న అడిగారు. సెట్స్ మీద ఇద్ద‌రు హీరోలు జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ మ‌ధ్య ఆలియా ప‌రిస్థితి ఎలా ఉండేదో ద‌గ్గ‌రుండి చూశారు కాబ‌ట్టి, దానికి సంబంధించిన ప్ర‌శ్న‌ను ఆయ‌న సంధించారు. "ఆలియా.. సెట్స్ మీద తార‌క్‌, చ‌ర‌ణ్ గంట‌ల త‌ర‌బ‌డి తెలుగులో మాట్లాడుకుంటూ, జోక్స్ వేసుకుంటూ, మ‌ధ్య మ‌ధ్య‌లో నీవైపు చూస్తుంటారు కదా.. అప్పుడు నిజంగా నువ్వెలా ఫీల‌య్యావ్‌?" అని అడిగారు రాజ‌మౌళి.

Also read:పులిలా గాండ్రించిన భీమ్‌.. అగ్నిలా ప్ర‌జ్వ‌రిల్లిన రామ్‌!

దానికి ఆలియా జ‌వాబిస్తూ, "మొద‌ట నేను తార‌క్‌తో వ‌ర్క్ చేశాను. 'నేను చాలా కాలంగా హీరోయిన్‌తో ప‌నిచేయ‌లేదు. ఎందుకంటే నేను చ‌ర‌ణ్‌తో వ‌ర్క్ చేస్తూ వ‌స్తున్నాను. ఏమ‌నుకోవ‌ద్దు' అని చెప్పాడు. 'నేను డోంట్ వ‌ర్రీ' అని చెప్పాను. ఆ త‌ర్వాత చ‌ర‌ణ్‌తో ప‌నిచేశాను. త‌ను తార‌క్‌కి పూర్తిగా ఆపోజిట్‌. చాలా క్వ‌యిట్‌గా ఉంటాడు. మొద‌టిరోజు నాతో ఎక్కువ‌గా మాట్లాడ‌లేదు కూడా..." అంటుంటే.. చ‌ర‌ణ్ జోక్యం చేసుకొని "నువ్వు చాలా అందంగా ఉన్నావ్‌. అందుకే నీతో మాట్లాడాలంటే బిడియ‌ప‌డ్డాను" అన్నాడు స‌ర‌దాగా.

Also read:'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్.. సీత‌ను పొట్ట‌లో త‌న్నిన బ్రిటీష్ ఆఫీస‌ర్‌!

ఆలియా కొన‌సాగిస్తూ.. "ఆ త‌ర్వాత ఆ ఇద్ద‌రితో ప‌నిచేశాను. విడివిడిగా చూస్తే ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు పూర్తి భిన్నం. కానీ ఇద్ద‌రూ క‌లిసి ఒక‌టే మాట‌లు.. ఒక‌రినొక‌రు ఆట‌ప‌ట్టించుకుంటూ ఉంటారు, జోక్స్ వేసుకుంటూ ఉంటారు. తార‌క్ త‌ర‌చూ చ‌ర‌ణ్‌ని ఆట‌ప‌ట్టిస్తుంటాడు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో 'జ‌క్క‌న్నా.. జ‌క్క‌న్నా' అని ఆయ‌న‌కు ఏదో చెప్తుంటాడు. చ‌ర‌ణ్ ఏమో 'నో.. నో.. 'అంటుంటాడు. అక్క‌డ నేనొక‌దాన్ని ఉన్నాన‌నే ధ్యాస‌ కూడా వారికి ఉండేది కాదు. నాతో మాట్లాడ్డానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్లు కాదు. ఆ ఇద్ద‌రు మాత్ర‌మే తెగ మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఫైన‌ల్లీ ఆ సాంగ్‌ను తీసేప్పుడు.. 'నాకేమీ అర్థం కావ‌ట్లేదు.. ట్రాన్స్‌లేట్ చేసి చెప్తావా?' అన‌డిగితే, చ‌ర‌ణ్ ట్రాన్స్‌లేట్ చేసి చెప్పాడు.." అని ఆగి తార‌క్ వైపు చూస్తూ,.. "నువ్విప్ప‌టికీ ట్రాన్స్‌లేట్ చేసి చెప్ప‌లేదు" అనంటే, "నేను చేశాను" అని తార‌క్ అన్నాడు. ఈ స‌ర‌దా స‌న్నివేశాన్ని అంద‌రూ బాగా ఎంజాయ్ చేశారు. ఆలియా క‌లుపుగోలుత‌నం, సింప్లిసిటీ అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నాయి.

Also read:'ఆర్ఆర్ఆర్' ట్రైలర్.. 'పులి'ని పట్టుకోవాలంటే 'వేటగాడు' కావాలి!