English | Telugu

ఎన్టీఆర్ నే నమ్ముకున్నాడు

పూరి జ‌గ‌న్నాథ్ సినిమా అంటే అందులో ఆలీ ఖచ్చితంగా వుండాల్సిందే. పూరి ప్రతి సినిమాలోనూ ఆలీకి ఓ సెప‌రేట్ ట్రాక్ ఉంటుంది. పూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఏ సినిమా అయినా తీసుకోండి ..ఇడియ‌ట్‌, అమ్మానాన్న ఓ త‌మిళ అమ్మాయి, పోకిరి, దేశ‌ముదురు, సూప‌ర్‌, చిరుత అన్ని సినిమాల్లో ఆలీ వుంటాడు. క‌థ‌లో అలీ పాత్ర‌కు ప్రాధాన్యం లేక‌పోయినా, ఏదోలా క‌థ‌లో దూర్చి వినోదం సృష్టిస్తాడు పూరి. అయితే ఈ అయితే, ఈసారి మాత్రం 'టెంపర్' లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో పూరీజగన్నాథ్ ఈ ఇద్దరికీ ప్లేస్ ఇవ్వలేదట. దీనికి కారణం ఎన్టీఆరేనట. జూనియర్ ఎన్టీయార్‌లోని అన్ని యాంగిల్స్‌ను బయటకు తేవాలని కమెడియన్లను పక్కకు పెట్టాడట. అలాగే ఈ సినిమాలో హీరో, విల‌న్‌, ఆఖ‌రికి ఐటెమ్ కూడా ఎన్టీఆరే అని చెప్పిన పూరి..ఎన్టీయార్‌తోనే కామెడీ ట్రాక్ కూడా పండించేలా ప్లాన్ చేశాడట.