English | Telugu

కళ్యాణ్ పవర్ చూపిస్తున్నాడు

నందమూరి పటాస్‌ భాక్సాఫీసు వద్ద ఎంతలా పేలిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస పరాజయాలతో డీలాపడిన కల్యాణ్‌రామ్‌ నుంచి అంచనాల్లేకుండా వచ్చిన పటాస్‌ ఈ ఏడాది తొలి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కలెక్షన్‌ల పరంగానూ కల్యాణ్‌రామ్‌ గత చిత్రాల్లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఊపులోనే ప్రస్తుతం శాటిలైట్‌ విక్రయాల్లోనే బాగానే పేలింది. కొన్ని సినిమాలు అంచనాల ఆధారంగా విడుదలకు ముందే శాటిలైట్‌ హక్కులు అమ్ముడుపోతుంటాయి. అయితే పటాస్‌ బంపర్‌ హిట్టైన నేపథ్యంలో శాటిలైట్‌ హక్కులు కూడా అంతే దిశగా పయనించింది. పటాస్‌ మూవీశాటిలైట్‌ హక్కులను దక్కించుకునేందుకు టీవీ ఛానెళ్ల మధ్య విపరీత పోటీ నెలకొనగా.. ఓ ప్రముఖ ఛానెల్‌ రూ.4కోట్ల 30లక్షలు ఇచ్చి పటాస్‌ శాటిలైట్‌ హక్కులను దక్కించుకుంది కల్యాణ్‌రామ్‌ గత చిత్రాల్లోకెల్లా అత్యధిక ధరకు శాటిలైట్‌ హక్కులు అమ్ముడుపోయిన సినిమాగా పటాస్‌ నిలిచింది.