Read more!

English | Telugu

మహేష్ ను పూరీ ఒప్పించాడా..?

పూరి జగన్నాథ్ స్పీడే వేరు. సినిమాలు తీయడంలోనే కాదు, ఆ సినిమా కథను హీరోలకు చెప్పి ఒప్పించడంలో కూడా పూరీ స్టైలే వేరు. గతేడాది చిరంజీవితో 150వ సినిమా అవకాశం తప్పిపోయినా, పూరీ స్పీడుకు మాత్రం బ్రేక్ లేదు. నెలల వ్యవధిలో లోఫర్ తీసి పారేశాడు. తర్వాత నందమూరి అన్నదమ్ములతో కథను ఒప్పించాడు. లేటెస్ట్ గా మహేష్ కు కూడా కథ చెప్పి ఒప్పించాడని సమాచారం. ఇప్పటికే తమ కాంబినేషన్ లో మళ్లీ సినిమా ఉంటుందని మహేష్, పూరి వేరు వేరు సందర్భాల్లో చెప్పారు. ఆ తర్వాత పూరి కొన్ని కథలు చెప్పినా మహేష్ కు ఎక్కలేదు. ప్రయోగాల జోలికి పోకుండా, పూర్తి ఎంటర్ టైనర్ గా సినిమా కావాలని మహేష్ చెప్పడంతో, అలాంటి కథే పూరి మహేష్ కు వినిపించాడట. వినగానే కథ నచ్చేయడంతో, మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనేది ఇన్ సైడ్ టాక్. ఇప్పటికే వీళ్లిద్దరి సూపర్ కాంబినేషన్ లో పోకిరి, బిజినెస్ మ్యాన్ వచ్చాయి. రెండూ కూడా బ్లాక్ బస్టర్లే. ముచ్చడగా మూడో సారి టీం అప్ అవబోతున్న ఈ జంట, ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి..