English | Telugu

అమీర్ ఖాన్ ను మళ్లీ తీసుకున్నారు..!!

భారతదేశంలో అసహనం పెరిగిపోతుందని, తన భార్య దేశం వదిలి వెళ్లిపోదామంటోదని వ్యాఖ్యలు చేసి, అమీర్ ఖాన్ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. దాంతో నేను అన్నది మీడియా వక్రీకరించింది అని సర్దిచెప్పాల్సి వచ్చింది. తర్వాతి పరిణామాల్లో, అమీర్ ను ఇంక్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా భారత ప్రభుత్వం తొలగించింది. తనకున్న మిగిలిన ఎండార్స్ మెంట్స్ ను కూడా అమీర్ కోల్పోయాడు. దీనిపై మోడీ పునరాలోచించారో ఏమో గానీ, ఛాయ్ పే చర్చా కార్యక్రమానికి అమీర్ ను ఆహ్వానించారు. తాజాగా అమీర్ ను కరవు రహిత మహారాష్ట్ర ప్రోగ్రామ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబోతున్నారని సమాచారం. గ్రామాల్లో ఇరిగేషన్ పద్ధతుల్ని ఎలా నిర్వహించాలి, వ్యవసాయంలో లాభాలు ఎలా సంపాదించాలి లాంటి విషయాలపై అమీర్ అవగాహన కల్పిస్తారట. ఈ మేరకు మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఈరోజు ప్రకటన చేయబోతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.