English | Telugu

ఆ మెగా హీరో ఖాళీ

మెగా హీరోలెప్పుడూ బిజీనే. ఎవ‌రి క్రేజ్ వాళ్ల‌కుంది. ఏడేళ్ల నుంచి సినిమాలు చేయ‌ని చిరంజీవి.. మొన్న‌టి వ‌ర‌కూ సినిమాల్లేని అల్లు శిరీష్ కూడా.. ఇప్పుడు బిజీగా మారిపోయారు. సాయిధ‌ర‌మ్‌తేజ్‌కి ఖాళీ అనేదే లేకుండా పోయింది. చ‌ర‌ణ్‌, బ‌న్నీ, ప‌వ‌న్ ఆల్వేస్ బిజీ. అయితే... వ‌రుణ్‌తేజ్ మాత్రం ప్ర‌స్తుతానికి ఖాళీ అయిపోయాడు. ముకుంద‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా హీరో.. కంచెతో ఆక‌ట్టుకొన్నాడు. లోఫ‌ర్‌తో మాస్ ఇమేజ్ తెచ్చుకొందామ‌న్న అత‌ని ప్ర‌య‌త్నం బెడ‌సి కొట్టింది. రాయ‌బారి సినిమా కూడా అర్థాంత‌రంగా ఆగిపోవ‌డంతో.. వ‌రుణ్ ఇప్పుడు స‌డ‌న్‌గా ఖాళీ అయిపోయాడు. క్రిష్ సినిమా ఉంది క‌దా, అని మిగిలిన క‌థ‌ల్ని లైట్ తీసుకొన్న వ‌రుణ్ చేతిలో ఇప్పుడు సినిమాలేదు. దాంతో నాగబాబు సైతం కంగారు ప‌డిపోతున్నాడ‌ట‌. బాబుకి అర్జెంటుగా ఓ సినిమా సెట్ చేయాల‌ని ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇంట్ర‌స్ట్రీలో కొద్దో గొప్పో పేరుండి, ఇప్పుడు చేతిలో సినిమాల్లేని ద‌ర్శ‌కుల‌పై నాగ‌బాబు దృష్టి సారించాడ‌ట‌. `మా అబ్బాయి కోసం మంచి క‌థ ఉంటే చెప్పండి.. ప్రొడ్యూస‌ర్లు రెడీగానే ఉన్నారు` అంటూ రాయ‌బారం పంపుతున్నాడ‌ట‌. ఆయ‌న లక్ష్యం ఒక్క‌టే.. `వ‌రుణ్ ఖాళీగా లేడు..` అనే సంకేతాలు ప‌రిశ్ర‌మ‌కు పంపడం. మ‌రి ద‌ర్శ‌కులకు కాస్త‌యినా టైమ్ ఇవ్వాలి క‌దా? వ‌రుణ్ ని దృష్టిలో ఉంచుకొని క‌థ‌లు సిద్ధం చేయాలి క‌దా? లేదంటే పురానా జ‌మానాలో హీరోలు రిజ‌క్ట్ చేసిన క‌థ‌ల‌న్నీ వ‌రుణ్ కోసం మ‌ళ్లీ బ‌య‌ట‌కు తీయాల్సివ‌స్తుంది. మ‌రి అందుకు వ‌రుణ్ బాబు సిద్ధ‌మేనంటారా??

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.