English | Telugu

పూరీ.. సీక్వెల్‌కి సీన్ ఉందా?

అటు ఛార్మి, ఇటు పూరి ఎన్నో ఆశ‌లు పెట్టుకొన్న జ్యోతిల‌క్ష్మి శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఎన్నో అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌కు వెళ్లిన ప్రేక్ష‌కులు చ‌తికిల ప‌డ్డారు. విమ‌ర్శ‌కులు పూరిపై గ‌న్నులు ఎక్కిపెట్టారు. పూరి ఏమాత్రం శ్ర‌ర్థ పెట్ట‌కుండా, స‌గం స‌గం వండిన వంట‌కంలా ఈ సినిమా తీశాడ‌ని ఏకేస్తున్నారు. వ‌సూళ్లూ ఏమాత్రం బాగోలేవు. ఈ సినిమాకి లాభాలు రావ‌డం అటుంచితే, క‌నీసం డ‌బ్బులొస్తాయా అనేది అనుమానంగా మారింది. మొత్తానికి జ్యోతిల‌క్ష్మి ఓ విఫ‌ల ప్ర‌యత్నం. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ జ్యోతిల‌క్ష్మి 2 తీస్తామ‌ని ఎగిరిగంతేసిన పూరి, ఛార్మి, క‌ల్యాణ్‌... ఇక అటు వైపు ఆలోచించ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే సీక్వెల్‌కి స‌రిప‌డా క‌థ కాదిది. సీక్వెల్ ఉద్దేశం ఉంటే క్లైమాక్స్ లో కొన్ని లింకులు వ‌దులుతారు. ఈ సినిమాలో అలాంటివేం జ‌ర‌గ‌లేదు. దానికి తోడు... తొలిభాగం హిట్ట‌యితేనే సీక్వెల్‌కి ప్రాణం వ‌స్తుంది. జ్యోతిల‌క్ష్మికి అంత సీను కూడా లేదాయె. దాంతో.. జ్యోతిల‌క్ష్మి 2 వ‌చ్చే అవ‌కాశాలు లేనట్టే.